రివ్యూ రాజా తీన్‌మార్ : ఉన్నది ఒకటే జిందగీ – ఫ్రెండ్ షిప్ > లవ్

Friday, October 27th, 2017, 02:04:38 PM IST

తెరపై కనిపించిన వారు: రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి

కెప్టెన్ ఆఫ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ : కిశోర్ తిరుమల

మూల కథ :
అభి (రామ్), వాసు (శ్రీవిష్ణు) లు చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేసేంత గొప్ప స్నేహం బంధం వాళ్ళది. అలా హాయిగా జీవితం గడుపుతున్న వారి మధ్యలోకి మహా (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది.

దాంతో వాళ్ళ మధ్యన మనస్పర్థలు మొదలై ఒకరికొకరు దూరమైపోతారు. అలా మహా మూలాన దూరమైన అభి, వాసులు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, అసలు మహా ఎవరు, ప్రాణ స్నేహుతులైన అభి, వాసులు ఆమె వలన ఎందుకు దూరమయ్యారు అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> సినిమా ఆరంభం నుండి చివరి వరకు దర్శకుడు కిశోర్ తిరుమల స్నేహమనే ఎమోషన్ మీదే కథను నడపడం బాగుంది. దీని వలన రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ పోయి కొంత ప్రత్యేకత కనబడింది. కాబట్టి దర్శకుడు ఎంచుకున్న నైపత్యానికి మొదటి విజిల్ వేయాలి.

–> ఇక స్నేహం గొప్పతనాన్ని చూపించడానికి దర్శకుడు రాసుకున్న ప్రీ ఇంటర్వెల్, సెకండాఫ్లోని రెండు సన్నివేశాలు బాగా కనెక్టయ్యాయి. కాబట్టి రెండో విజుల్ వేసుకోవచ్చు.

–> సినిమాలో ప్రియదర్శి కామెడీ మధ్యలో నవ్వించగా, అనుపమ, రామ్ ల లవ్ ట్రాక్ ఆసక్తికరంగా బాగుంది. అలాగే ప్రేమ కన్నా స్నేహం గొప్పదనే పాయింట్ కూడా ఆకట్టుకుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సినిమాలో స్నేహాన్ని ఎలివేట్ చేసే సీన్లు కేవలం మూడే ఉండటం వలన మిగతా సినిమా మొత్తం పెద్దగా ఆకట్టుకోలేదు.

–> ఒకేసారి ప్రేమలో విఫలమైన హీరో రెండోసారి ప్రేమలో పడటం అనే విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చేయడం నిరుత్సాహాన్ని కలిగించింది.

–> ఇక సెకండాఫ్ క్లిమక్ కూడా బాగా భావిద్వేగంగా ఉంటుందో అనుకుంటే దాన్ని కూడా సాధారణంగా ముగించేయడం, ఫస్టాఫ్ ను ఇంటెర్వెల్ వరకు కొంత సాగదీయడం కూడా డిసప్పాయింట్ చేసే అంశాలు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ సినిమాలో పాత్రలు. కథ, కథనం అన్నీ నార్మల్ గానే ఉన్నాయి.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : సినిమా చూసాక ఏమనిపించింది ?
–> మిస్టర్ బి : ప్రేమ కన్నా స్నేహం గొప్పదనే పాయింట్ బాగుంది.
–> మిస్టర్ ఏ: అవును. సినిమా కొంత బోర్ కొట్టినా ఆ కంక్లూజన్ మటుకు నచ్చింది.