వివి వినాయక్ కు మాతృవియోగం

Tuesday, December 2nd, 2014, 08:34:35 PM IST


ప్రముఖ తెలుగుసినిమా దర్శకుడు వివి వినాయక్ తల్లి నాగరత్నం ఈ రోజు కన్ను మూశారు. హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక వివి వినాయక్ తల్లి నాగరత్నం మరణం పట్ల పలువురు సిని ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు వివి వినాయక్ స్వస్థలం. వినాయక్ తండ్రి కృష్ణా రావు సినిమా డిస్ట్రిబ్యుటర్ గా వ్యవహరించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో వినాయక్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.