అందరికీ సమన్యాయం చేస్తాం : చంద్రబాబు

Tuesday, December 23rd, 2014, 04:24:59 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కురుకు పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన ఈ రోజు అసెంబ్లీ మాట్లాడారు. కోనసీమలో పంతవిరామం ప్రకటించారని, పెద్ద రైతులకు కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి 12టిఎంసిల నీటిని రాయలసీమకు తరలించామని అన్నారు. వ్యవసాయం కోసం రైతులకు 7గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని… ఎక్కడైనా 7 గంటలకంటే తక్కువ కరెంట్ ఇస్తే… ఫిర్యాదు చేయాలని… తప్పకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.