మంచి చిత్రాలను ప్రోత్సహిస్తాం: కెసిఆర్

Friday, December 5th, 2014, 08:25:00 PM IST


సమాజ హితాన్ని కోరే చిత్రాలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేసిఆర్ అన్నారు. నా బంగారు తల్లి చాలా మంచి చిత్రమని అందుకే మూడు జాతీయ అవార్డులతోపాటు ఇంటర్నేషనల్ అవార్డులను సైతం సొంతం చేసుకుందని కొనియాడారు. ఈ చిత్రానికి వినోద పన్ను నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా రూపకర్త అయిన ప్రజ్వలను అభినందించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే.