తన అక్రమసంబంధం బయటపడుతుందనే భయంతో ఆమె ఏమి చేసిందంటే!

Friday, May 11th, 2018, 11:08:36 AM IST

కర్ణాటకలోని బైహొంగల్ ప్రాంతానికి చెందిన కల్పనా బసు, బసురాజ్ బసు తమ ఇద్దరు పిల్లలతో సహా బ్రతుకుతెరువు కోసం గోవా లో నివాసముంటున్నారు. వృత్తి రీత్యా టాక్సీ డ్రైవర్ అయిన బసురాజ్ 15రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతుంటాడు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని భర్త స్నేహితులతో అక్రమసంబంధం పెట్టుకుంది కల్పనా బసు. భర్త ఇంటివద్ద లేని రోజుల్లో వారితో రాసలీలలు సాగించిన ఆమెపై కొంత అనుమానం వచ్చిన భర్త ఒకరోజు ఆమెను నిలదీసాడు. అయినా పద్ధతి మార్చుకోని ఆమె, తన అక్రమసంబంధాలకు అడ్డొచ్చిన భర్తను ఎలా అయినా హతమార్చాలని నిర్ణయించింది. వెంటనే ఆమె ప్రియులైన అబ్దుల్ కరీం, సురేష్ కుమార్, షైక్ పంకజ్ లతో కలిసి ఒక పధకం పన్నింది.

కాగా అలానే మరొకరోజు ఆమె సాగిస్తున్న అక్రమసంబంధం విషయం పూర్తిగా తెలుసుకున్న భర్త గట్టిగా నిలదీయడంతో, పక్కనే వున్న కత్తితో అతికిరాతకంగా అతడిని పొడిచి చంపింది. ఆపై ప్రియులకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పింది. వాళ్ళు వెంటనే ఇంటికి చేరుకొని బసురాజ్ మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఒక గొనె సంచిలో మూటకట్టి కారులో తీసుకెళ్లి ఊరవతల పడవేశారు. అయితే విషయమై అనుమానం వచ్చిన కల్పనా బసు పక్కింటి వ్యక్తి ఒకతను పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు. వెంటనే ఘటనాస్థలిని చేరుకున్న పోలీస్ లు నిందితులను పట్టుకుని ప్రశ్నిచగా జరిగిన విషయాన్నీ కల్పనా వెల్లడించింది. ఆమెతోసహా వారిపై హత్యానేరం క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు…….