ఇలా చెయ్యొచ్చు.. అలా చేయకూడదు : ఫస్ట్ టైం అమ్మాయితో స్నేహం చేస్తే..!

Saturday, March 26th, 2016, 06:51:32 PM IST


అమ్మాయితో స్నేహం అంటే ఏ అబ్బాయైనా ఎగిరి గంతేస్తాడు. అమ్మాయి ఏది కావాలంటే దాన్ని కాదనకుండా ఇస్తాడు. అది ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే. ఇలా అమ్మాయితో స్నేహం పెంచుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మరి మొదటిసారి అమ్మాయితో స్నేహం చేసే సమయంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా చెయ్యొచ్చు :

1. మొదటిసారి ఒక అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ గా చేసుకునే సమయంలో యువకులు చాలా ఆలోచిస్తారు. అమ్మాయితో ఎలా మాట్లాడాలి.. ఎలా ఉండాలి అని. ఒక ఇంటర్వ్యూ కు కూడా అలా హొమ్ వర్క్ చేయం. అదేమంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కదా అంటారు. అలాంటివి ఏమి అవసరం లేదు.. సింపుల్ గా ఎప్పటిలాగే చిన్న చిరునవ్వుతో పలకరిస్తే చాలు.
2. డ్రెస్ స్టైల్ విషయంలో అమ్మాయికి నచ్చినట్టుగా కాకుండా.. మనకు నచ్చినట్టుగా వేసుకోవాలి. అప్పుడే ఇప్రెస్ చేయగలం.
3. మొదటిసారి కలిసినపుడు ఎలా పరిచయం చేసుకోవాలి.. అసలు స్నేహం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి అన్నది ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అప్పుడే అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలం.

ఇలా చెయ్యకూడదు :
1. కలిసిన మొదటిరోజే అతిగా మాట్లాడి చిరాకు తెప్పించకూడదు.

2. నేను.. నా.. అనే పదాలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ పదాలు ఎక్కువగా వాడితే, సెల్ఫిష్ అని అనుకోవచ్చు. ఫలితం ఫ్రెండ్ షిప్ కట్ అవ్వొచ్చు.

3. భారీ గిఫ్ట్ లు ఇస్తే… అమ్మాయిలు పడిపోతారు అనుకోవడం తప్పు. భారీ గిఫ్ట్ లు ఇవ్వడం వలన వారు ఎక్కువగా ఊహించుకుంటారు. భావిష్యత్తులో అటువంటివి కావాలని మరలా అడిగితే మీరే నష్టపోతారు.

4. కొంతమంది అమ్మాయిలు కేవలం అబ్బాయిని అవసరాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేసేముందు జాగ్రత్తగా ఉండాలి.
5. అమ్మాయిల సైకాలజీ తెలిసుండి సమయానికి తగిన విధంగా మాట్లాడగలిగితే.. అతని స్నేహం కోసం అమ్మాయిలు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు.