ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ లీడర్ షిప్ ను కోరుకుంటున్నారా..?

Sunday, May 15th, 2016, 09:50:17 AM IST


ఆంధ్రా రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఇచ్చిన వాటిలో ఏవో కొన్ని నెరవేర్చి మిగతా వాటిని గాలికి వదిలేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు చూసుకుంటే.. అవన్నీ నెరవేరుతాయా అన్నది అనుమానమే. అనుకున్నట్టుగానే చాలా హామీలు పెండింగ్ లో పడిపోయాయి. ఇక రాజధానిని ఘనంగా నిర్మించుకోవాలని అనుకున్నారు. అందుకు భూములు కూడా సేకరించారు. కాని జరుగుతున్నది ఏమిటి.. రాజధాని కోసం నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపిస్తున్నది.

ఇక హామీలు నెరవేర్చడంలో వెనకబడి పోవడంతో మిత్రపక్షంగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టికి దూరంగా ఉంటున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలంగా పుంజుకోవాలని చూస్తున్నది. బలంపుంజుకొని ఎన్నికలలో పోటీ చేస్తే.. తప్పకుండా విజయం సాధించవచ్చని జనసేన ఉద్దేశ్యం. అందుకే ఇప్పటి నుంచే ప్రణాలికలు సిద్దం చేసుకుంటున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీల కంటే కూడా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ విఫలం కావడం, వైఎస్ఆర్ సీపీ కి చాన్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు జనసేన వైపు ప్రజలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. పవన్ భావాలు గొప్పగా ఉంటాయి కాబట్టి పవన్ కు చాన్స్ ఇద్దామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ప్రజలు ప్రజలు అవకాశం ఇస్తే పవన్ ఉపయోగించుకుంటాడా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుంది.