తాత్కాలికంతో సరిపెడతారా..?

Friday, February 5th, 2016, 11:59:22 AM IST


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన గతేడాది దసరా రోజున జరిగింది. అంటే అక్టోబర్ 22న శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని శంకుస్థాపనను అంగరంగవైభోగంగా నిర్వహించింది ప్రభుత్వం. శంకుస్థాపన ముగిసింది.. ఇక రాజధాని నిర్మాణమే తరువాయి. శంకుస్థాపన జరిగి దాదాపు నాలుగు నెలలు దాటింది. ఇంతవరకు అక్కడ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇదుగో అదుగో.. అంటున్నారు తప్పించి పని ముందుకు సాగుతున్నట్టు కనిపించడంలేదు. 2018 నాటికి ఫస్ట్ పేస్ నిర్మాణాలు పూర్తిచేయాలి అని ప్రభుత్వం సంకల్పించిది.
2018 అంటే ఐదేళ్లో పదేళ్ళొ లేదు. రెండు సంవత్సరాలే ఉన్నది. ఈ రెండేళ్ళలో మొదట ప్రకటించినట్టుగా మొదటి ఫేజ్ నిర్మాణాలు పూర్తవుతాయా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక, వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమరావతిలో సచివాలయం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇది శాశ్వత నిర్మాణం కాదు. కేతలం తాత్కాలికమేనట. దీనికి ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నది.అసలే ప్రభుత్వ ఖజానా లోటులో ఉంటే.. ఇటువంటి సమయంలో తాత్కాలిక నిర్మాణాల కోసం డబ్బులు ప్రభుత్వం ఇలా డబ్బులు వృధా చేయడం ఎంతవరకు సబబు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇలా తాత్కాలిక నిర్మాణాలను నిర్మించుకుంటూ పోయి చివరకు శాశ్వత నిర్మాణాలను పక్కనపెడతారా ఏమిటి అని కొంతమంది విమర్శిస్తున్నారు.