రాష్ట్రంలో ఏం జరిగినా అది పవన్ చుట్టే తిరుగుతుంది.. ఇదేం విచిత్రమో..!

Sunday, June 12th, 2016, 09:50:52 AM IST


సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ కు ఎంతటి క్రేజ్ ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక ట్రెండ్ ను సెట్ చేశారు సినిమా ఇండస్ట్రీలో. కాగా, ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. 2014 లో పార్టీని స్థాపించి తెలుగుదేశం, బీజేపి ల తరపున ప్రచారం చేశారు. ప్రచారం హిట్ అయింది. అయితే, పవన్ తరువాత రైతుల విషయంలో రెండు సార్లు అమరావతిలో పర్యటించి వారి తరపున మాట్లాడారు. రైతుల కోసం అవసరమైతే దీక్ష చేస్తానని కూడా చెప్పారు. ఇక తుని సంఘటన జరిగిన సమయంలో కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి, తుని ఘటనపై తన ప్రెస్ మీట్ పెట్టారు. కాపులకు అండగా ఉంటానని హామీ కూడా పవన్ ఇచ్చారు.

ఇక ఇదిలా ఉంటె, కాపుల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తున్నారు. అరెస్ట్ అయ్యి హాస్పిటల్ లో ఉన్న అక్కడ కూడా ఆయన దీక్ష చేస్తున్నారు. ఇక ఈ దీక్షకు కాంగ్రెస్, వైకాపా నాయకులు మద్దతు పలుకుతున్నారు. ఇక చిరంజీవి బాబు కు లేఖ కూడా వ్రాశారు. అయితే, దీనిపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలుసుకొని దానిపై వెంటనే స్పందించినపుడే రాజకీయాలలో ఉన్నట్టు అవుతుందని.. ఎప్పుడో ఒకసారి జనాల మధ్యకు వచ్చి వెళ్తే నాయకుడు ఎలా అవుతాడని కొంతమంది నాయకులు మండిపడుతున్నారు. ముద్రగడ విషయంపై పవన్ ఇంతవరకు ఎందుకని స్పందించడంలేదో అర్ధం కావడం లేదు.