ఆరోజు గంటాతో పాటు చిరు కూడా కన్నీరు పెట్టాడట..!

Monday, May 9th, 2016, 08:26:46 AM IST


గంటా శ్రీనివాసరావు.. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో గంటా ప్రజారాజ్యంలో చేరారు. ఎన్నికల అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా చిరు.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరు తన పార్టీని విలీనం చేయడంతో.. ప్రజారాజ్యంలో ఉన్న నాయకులంతా చిరుతో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు.

తరువాత 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లుగా విభజించారు. ఈ విభజన అనంతరం గంటా శ్రీనివాసరావు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో గంటా శ్రీనివాసరావు చిరుతో మాట్లాడారట. చిరుతో మాట్లాడిన సమయంలో ఆయన కంటతడిపెట్టారని, చిరు కూడా కంటతడిపెట్టారని గంటా తెలిపారు. తనను తమ్ముళ్ళతో సమానంగా చిరు గౌరవించారని గంటా చెప్పడం విశేషం.