సెప్టెంబర్ నుంచి పవన్ యాత్ర మొదలు.. 45 చోట్ల పోటీ..?

Thursday, April 21st, 2016, 08:26:43 AM IST


పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు.. అటు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో సెగలు కూడా పుడుతుండటంతో పవన్ కళ్యాణ్ వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైకాపా చాల వరకు ఖాళీ అవుతున్నది. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు వైకాపా నేతలు ఆకర్షితులౌతున్నారు. ప్రకాశం జిల్లాలో వైకాపా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇకపోతే, ప్రస్తుతం పవన్ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో.. తన కొత్త సినిమాపై దృష్టి సారిస్తూనే.. రాజకీయాలలో ఎలా ఎత్తులు వేయాలి అనే విషయంపై కూడా సుమలోచన చేస్తున్నట్టు సమాచారం.

ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో తొలివిడత యాత్ర చేస్తారని తెలుస్తున్నది. మొదట జనసేన ఎక్కడైతే పోటీ చేయాలి అనుకుంటున్నదో ఆక్కడి నుంచి పవన్ యాత్ర మొదలు పెడతారని సమాచారం. రాష్ట్రంలో ఎక్కడైతే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో.. ఏ ప్రాంతం అయితే అభివృద్ధికి దూరంగా ఆ ప్రాంతంపై పవన్ దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. అనంతపురం, ప్రకాశం, కృష్ణా జిల్లాలోని తూర్పు ప్రాంతాలను పవన్ ఎంపిక చేసుకున్నారని తెలుస్తున్నది. మొదట వీటిపై దృష్టి సారించి ఆ తరువాత మిగతా ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం. అంటే తొలివిడతగా జనసేన పోటీ చేయాలి అనుకుంటున్న 45 నియోజక వర్గాలలో పరిస్థితులను పవన్ తెలుసుకోబోతున్నారన్నమాట. భేష్.