పవన్ కళ్యాణ్ చేసిన పనిని రజనీకాంత్ ఎందుకు చేయలేకపోతున్నారు..?

Saturday, June 11th, 2016, 08:20:14 PM IST


తమిళ, ఆంద్ర ప్రాంతాల్లో సినిమాల ప్రభావం మామూలుగా ఉండదు. ఇక్కడ జనాలను ప్రాభావితం చేసే ఏకైక సాధనం సినిమా మాత్రమే. ఆ సినిమా అన్నా, అందులోని నటులన్నా ఇక్కడి జనాలకు అభిమానం, భక్తి. అలాంటి ఈ సినిమాలు 1980 వ దశకం నుండి ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలతో సైతం పెనవేసుకుపోయాయి. చిరంజీవిని మినహాయిస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు సినిమాల నుండి వచ్చి ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగారు. వాళ్ళ తరువాత అంతటి ఆదరణ కలిగిన నటులు తమిళనాడు, ఆంద్రప్రదేశ్ లలో ఇద్దరే ఉన్నారు. ఒకరు రజనీకాంత్ మరొకరు పవన్.

వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే చూడాలని అభిమానుల కోరిక. వాళ్ళ కోరిక మేరకే పవన్ ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ రజనీ మాత్రం ఎన్నో ఏళ్ళ నుండి అభిమానులు పట్టుబడుతున్నా రావడం లేదు. దీంతో అందరూ పవన్ చేసిన పనిని రజనీ ఎందుకు చేయలేకపోతున్నారు అనే ఆలోచనలో పడ్డారు. అందుకు కారణం రాజకీయ పరిస్థితి. ఏపీలోఅయితే 2014 లో పూర్తి రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రజలు ఓ నమ్మకం కోసం ఎదురు చూశారు. అందుకే పవన్ ఎంట్రీ పర్ఫెక్ట్ గా కుదిరింది. కానీ తమిళనాడులో గత 10 – 15 ఏళ్ళ నుండి బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది. రాజకీయ సంక్షోభం లేదు. ప్రజలకు ప్రత్యాన్మాయం అవసరం రాలేదు. అందుకే వచ్చినా ఫలితం ఉండదని రజనీ సైలెంట్ గా ఉన్నారని బలమైన మాట వినిపిస్తోంది.