మహేష్ కోసం ఆ ఎమ్మెల్యే తహతహలాడుతున్నాడు..?

Tuesday, May 3rd, 2016, 02:25:24 PM IST


మహేష్ బాబు తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ బుర్రిపాలెం వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడింది. అభివృద్ధి పనులను గురించి తెలుసుకున్నది. కాగా, మొన్నటి రోజున ఆంధ్రా హాస్పిటల్స్ సంస్థ బుర్రిపాలెంలో మెడికల్ క్యాంపు నిర్వహించింది.

ఇక ఇదిలా ఉంటే, ఈనెల 8 వ తేదీన మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి దగ్గరుండి పనులను సమీక్షిస్తున్నారు. బుర్రిపాలెంలో దాదాపు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మహేష్ బాబు చేస్తారని తెలుస్తున్నది. స్కూల్, హాస్పిటల్, పంచాయితీ భవనం, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి సౌకర్యాలను బుర్రిపాలెంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక, బుర్రిపాలెంలో పైలాన్ ను నిర్మించి మహేష్ బాబు చేత ఓపెన్ చేయించాలని అనుకుంటున్నట్టు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు.