బొద్దింకల హిట్ తో భర్తను చంపిన భార్య.. పట్టించిన కూతురు!

Thursday, August 9th, 2018, 04:44:45 PM IST

భార్య భర్తల మధ్య గొడవలు వస్తే విడాకులు తీసుకునే ఈ కాలంలో హత్యలు జరుగుతుండడం గమనార్హం. ముఖ్యంగా మహిళలు భర్తల తీరు నచ్చకపోతే వెంటనే విడాకులు కోరుతున్నారు. అయితే కొందరు మహిళలు మాత్రం అక్రమ సంబంధాల కారణంగా తాళి కట్టిన వాడిని కడతేర్చుతున్నారు. గత రెండు మూడు నెలల్లో ఈ తరహాలో ఎన్ని ఘటనలు జరిగాయో అందరికి తెలిసిందే. ఇటీవల ఫిల్మ్ నగర్ లో జరిగిన ఒక ఘటన విషయంలో కూడా భార్య వ్యవహారం వల్లే భర్త ప్రాణాలు కోల్పోయాడని తేలింది. మొదట భర్త పెట్టె హింస భరించలేక పిల్లల భవిష్యత్తు కోసం చంపేసినట్లు చెప్పిన భార్య కూతురి చెప్పిన విషయం బయటపడటంతో నిజం ఒప్పుకుంది. భర్త బానోతు జగన్ నాయక్ నోట్లో భార్య దేవిక బొద్దింకల మందు హిట్ కొట్టి చంపినట్లు పోలీసుల ఎదుట నిజం చెప్పింది.

వారి పిల్లల విచారణలో పోలీసులు అసలు విషయాలను బయటకు లాగారు. సహా ఉద్యోగి అయిన తోట బెనర్జీ(35) అనే వ్యక్తితో దేవిక గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనగిస్తోంది. తరచు అతను ఇంటికి రావడం గమనించిన భర్త విషయం తెలుసుకొని భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం ఆమెను ఉద్యోగం మాన్పించి బెనర్జీకి కూడా భర్త జగన్ హెచ్చరిక జారీ చేశాడు. అలాగే ఇల్లు కూడా మారారు. అయినప్పటికీ వారిద్దరి తీరు మారలేదు. దీంతో ఓ రోజు తాగేసి వచ్చిన భర్త జగన్ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. అయితే ఎలాగైనా భర్తను విడిపించుకోవాలని అనుకున్న దేవిక ప్రియుడి సాయంతో రాత్రి అందరూ పడుకొని ఉండగా ప్లాన్ వేసింది.

బెనర్జీ ఓ రైస్ కుక్కర్ ని అతని తలపై గట్టిగా ఊపిరాడకుండా ఉంచగా.. ఇంతలోనే దేవిక భర్త నోట్లో హిట్ స్ప్రే కొట్టడంతో జగన్ ఊపిరాడలేదు. అంతే కాకుండా వృషణాలను గట్టిగా మెలితిప్పడంతో అతను మరణించాడు. అరుపులు వచ్చాయని లేచిన పిల్లలు ఇంటి ఓనర్ వచ్చి చూడగా అప్పటికే ప్రియుడు పారిపోయాడు. అది వాళ్ళు చూశారు. అనంతరం విచారణలో నిజం బయటపడింది. మొదట పిల్లలకు భార్య దేవిక విషయం ఎవరికి చెప్పవద్దని వివరించినప్పటికీ వారు దేవిక జరిపిన దారుణాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో ప్రియుడిని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.