ఎల్ఐసి డబ్బుకోసం భర్తను ప్లాన్ చేసి మర్డర్ చేయించిన భార్య!

Monday, September 3rd, 2018, 06:05:59 PM IST

ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు, ఈ లోకంలోని సర్వము డబ్బుమయమే అని, ప్రతిదీ డబ్బుతోనే ముడిపడివుందని, మానవుడు డబ్బుకోసం తన పర అనే బేధాలు లేకుండా తృచ్ఛమైన డబ్బుకోసం ఎటువంటి నీచానికి అయినా పాల్పడుతున్నాడు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో కట్టుకున్న భార్య, తన భర్తను ప్లాన్ చేసి మర్డర్ చేయించిన ఉదంతం నగర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మ్యాటర్ లోకి వెళితే, వనస్థలిపురంలో పోస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న కెస్య నాయక్ కు కొన్నేళ్ల క్రితం పద్మ అనే మహిళతో వివాహం జరిగింది. అయితే ఎన్నేళ్ళైనా వారికి పిల్లలు కలుగకపోవడంతో కెస్య, ఇటీవల శైలజ అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు. కాగా ఈ వివాహం విషయం తెలుసుకున్న పద్మ కెస్య పై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది.

అయితే ఇటీవల ఒక కారును కొన్నకెస్య నాయక్, వినోద్ అనే వ్యక్తిని ఆ కారుకి డ్రైవర్ గా నియమించాడు. కారు విషయం తెలుసుకున్న పద్మ, మెల్లగా వినోద్ ను ఆశ్రయించి తన సమస్య చెప్పి ఎలాగైనా కెస్య ను అంతమొందించాలని వినోద్ కి చెప్పి రూ.10లక్షలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిమిత్తం రూ.15వేలు అడ్వాన్స్ గా ఇటీవల ఇచ్చింది. కాగా నిన్న కెస్య తో పాటు నగరంలోని ఒక బార్ కు వెళ్లిన వినోద్, తిరుగు ప్రయాణం అయిన సమయంలో కెస్య మద్యం మత్తులో ఉండగా అతడిని గొంతు నులిమి చంపేశాడు. అయితే అతడి మరణాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని భావించి, కారును 100కి.మీ. వేగంతో నడిపి ఒక చెట్టును ఢీ కొట్టాడు. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఏదో యాక్సిండెంట్ జరిగింది అని భావించిన అక్కడి స్థానికులు విషయాన్నీ పోలీసులకు చెప్పారు.

వెనువెంటనే ఘటన స్థలిని చేరుకున్న పోలీసులు, గాయాలతో పడివున్న వినోద్ మరియు చనిపోయి వున్న కెస్య ను హాస్పిటల్ కి తరలించారు. అయితే కెస్య శవంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఏమి జరిగిందని వినోద్ ని గట్టిగా నిలదీయడంతో, వినోద్ కెస్యను తానే హత్య చేసానని, కెస్య మొదటి భార్య పద్మ తనకు సుపారీ ఇచ్చిందని విషయం మొత్తం చెప్పడంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ హత్య అతనిపేరిట వున్న ఎల్ఐసి డబ్బు కోసమే చేయించానని, పైగా కెస్య రెండవ పెళ్లి చేసుకోవడం కూడా తనకు నచ్చలేదని పద్మ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు…..