పవన్ వ్యాఖ్యలతో రాజకీయాలలో కలకలం.. నేతలో మార్పు వస్తుందా..?

Sunday, May 1st, 2016, 09:51:40 AM IST


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం రోజున కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు మాట తప్పుతున్నదని.. ఇది భావ్యం కాదని అంటూనే.. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజన చేసి చేతులు చేతులు దులుపుకున్నదని పవన్ విమర్శించారు. ఇప్పటికే ప్రజలు అసహనంతో ఉన్నారని, వారంతా ప్రత్యక్షంగా బయటకు వచ్చి మరలా పోరాటం చేయకమునుపే అధికారపక్షంలోని నేతలు ప్రతిపక్షాలతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పోరాటం చేయబోతున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తున్నది.

పవన్ ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు రాజకీయాలలోకి ఎంటరైపొతే మొదట ప్రత్యేక హోదాపైనే పోరాటం చేస్తారని దీనిని బట్టి తెలుస్తున్నది. మరి పవన్ తో ఎంతమంది నేతలు కలిసి పనిచేస్తారో చూడాలి. అధికార పక్షంతో ప్రతిపక్షం నేతలు ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాటం చేస్తారా.. లేదంటే.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం యధావిధిగా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తూనే కాలం గడుపుతుందా చూడాలి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నేతలకు ఝలక్ ఇవ్వకముందే నేతలు తేరుకొని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే మంచిది.