ఒబామా హైదరాబాద్ వస్తాడా ?

Tuesday, December 2nd, 2014, 03:37:29 PM IST


అమెరికా అధ్యక్షుడు ఒబామా జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే కార్యక్రమానికి విశిష్ట అతిదిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రెండు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా దృవీకరించాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒబాను విశాఖ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా తయారుచేసేందుకు ఒబామా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఒబామాను జనవరిలో విశాఖకు రప్పించేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఒబామాను హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ హైదరాబాద్ లోని అమెరికా కన్సోలేట్ కార్యాలంలో అమెరికా అధికారులతో సమావేశం జరిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ విషయమై అమెరికా ఎంబసికి లేఖ వ్రాశారు. ఒబామా హైదరాబాద్ వస్తాడా? లేదా ? అసలు ఒబామా భారత్ పర్యటన ఎన్నిరోజులు ఉంటుంది… అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఇక హైదరాబాద్ ప్రపంచంలో చూడదగిన 25 ప్రదేశాలలో ఒకటిగా స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.