ఒబామా స్వచ్చ భారత్ లో పాల్గొంటారా..?

Wednesday, January 21st, 2015, 06:30:29 PM IST


అగ్రరాజ్యం అధినేత బరాక్ ఒబామా ఈ నెల 25న భారత్ వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా ఢిల్లీలో భారీ బద్రతా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో దాడులు జరగవచ్చు అనే హెచ్చరికలు అందటంతో దాదాపు 15వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో చీమ చిటుక్కు మన్నా పట్టేసుకునేటట్టు కట్టుదిట్టమైన బద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

ఒక, ప్రధాని మోడీ, గాంధిజీ కలను నిజం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వచ్చభారత్ కార్యక్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రచారం చేశారు. ఒబామాకు గాంధీజీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. ఇప్పుడు అందరి మదిలోను ఒక ప్రశ్నమెదులుతున్నది. అది ఏమిటంటే, ఒబామా భారత్ వచ్చాక, మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొంటారా… అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఒబామా కనుక స్వచ్చభారత్ లో కనుక పాల్గొంటే… స్వచ్చభారత్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి లభిస్తుంది అన్నది వాస్తవం. మరి ఒబామా పాల్గొనేది లేదని తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఓపికగా వైట్ చేయాల్సిందే. ఇప్పటికే స్వచ్చభారత్ కోసం ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సాయం చేస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఖ్యాతి తీసుకురావాలని మోడీ భావిస్తున్నారు. మరి ఆయన ఆశయం నెరవేరుతుందా చూద్దాం.