బాబు పవన్ ల ప్రేమ కథ కంటిన్యూ అవుతుందా.. బ్రేక్ అవుతుందా..?

Tuesday, May 3rd, 2016, 08:25:44 AM IST


2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. పవన్ కళ్యాణ్ పార్టీపెట్టిన రోజునే చంద్రబాబు మంచివ్యక్తి అని, చంద్రబాబు కలిసి పనిచేయడానికి అభ్యంతరాలు లేవని చెప్పారు. చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ ఫంక్షన్ లో పవన్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్రంలో సమస్యలు పెరిగినపుడు పవన్ బాబు తరపున మీడియా ముందుకు వచ్చారు. సమస్యకు పరిష్కారం కనుగొంటారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో సందేహాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా రాజకీయాలలో వస్తున్నా మార్పులతో పవన్ కూడా మారిపోయారు.
వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బాబు షాక్ తిన్నాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పవన్ కు ఇష్టం లేదు. ఈ కారణంతోనే ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్తున్నాయని తెలుస్తున్నది. మరి వీటిని సర్దుకొని వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తారా లేదంటే బ్రేక్ ఆప్ అయ్యి విడివిడిగా పోటీ చేస్తారా అన్నది త్వరలోనే తేలిపోతుంది.