తమిళనాడులో అమ్మ ఆకర్షణీయమైన పధకాలను ప్రవేశపెట్టి.. వాటిని అమలు చేయడంలో సక్సెస్ అయింది. అనవసరపు హామీలు ఇవ్వకుండా.. ప్రజలకు అవసరమైన హామీలను మాత్రమే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత అమ్మకే దక్కింది. అంతేకాదు.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఐదు హామీలపై సంతకాలు చేసింది. అమ్మ సంతకాలు చేసిన హామీలు జూన్ 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ఇక ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో అమ్మలాంటి పరిపాలన రావాలి. అమ్మ తమిళనాడును అలా అభివృద్ధి చేస్తున్నదో అటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కు కూడా కావాలి. తమిళనాడు దేశంలో మొదటి ఐదు రాష్ట్రాలలో ఒకటిగా ఉన్నది. విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఉన్నా, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా వెనకబడింది. ఒక్క టెక్నాలజీలో మాత్రం ఇప్పుడిప్పుడే అడుగు ముందుకు వేస్తున్నది.
టెక్నాలజీ అవసరమే కాని, అంతకంటే ముందు పేదలకు కావలసిన అవసరాలు తీర్చగలగాలి. అక్కడ అమ్మ చేసింది అదే. అందుకే అమ్మ సక్సెస్ అయింది. ఇక అమ్మ సంగతి పక్కన పెడితే, అమ్మ ఎలాంటి భావాలు కలిగి ఉన్నదో అటువంటి భావాలు ఇంచుమించుగా పవన్ లో కనిపిస్తున్నాయి. అక్కడ అమ్మ పేదలకోసం ఏమైతే చేస్తున్నదో.. పవన్ కూడా ఒకవేళ అధికారంలో వస్తే (కొన్ని సీట్లు గెలుచుకున్నా సరే) అమ్మ మాదిరిగానే పధకాలు ఇక్కడ పేద ప్రజలకోసం పాటు బడాలి. పేదలకు అండగా నిలవాలి. ఇంకా చెప్పాలి అంటే.. పవన్ పార్లమెంట్ కు కాకుండా.. ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. స్థానికంగా ఉంటేనే పవన్ పోరాటం చేయగలుగుతాడు. ఢిల్లీ స్థాయిలో వెళ్లి అక్కడ కూర్చుంటే.. ఇక్కడ పనులు చక్కదిద్దటం కష్టం అవుతుంది. మరి పవన్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో చూడాలి.