పవన్ పొలిటికల్ ఎంట్రీకి సర్దార్ పనికొస్తుందా..?

Friday, April 1st, 2016, 12:59:15 PM IST


పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఉగాది సందర్భంగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. రెండు పాటల చిత్రీకరణ ఉండగానే సినిమా పూర్తికావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే, ఈ సినిమా కథమొత్తం మైనింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తున్నది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మైనింగ్ మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కోల్ మైనింగ్ లో అక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే, సర్దార్ గబ్బర్ సింగ్ మైనింగ్ అంశాన్ని ప్రధానాంశంగా తీసుకోవడానికి కారణం ఏమిటి.. అని కనుక విశ్లేషిస్తే.. ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనే కాకుండా.. కేంద్రంలో కూడా మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ఎవరు ఎలా పరిష్కరిస్తున్నారు అని పక్కన పెడితే.. సినిమా పరంగా చూస్తుకుంటే.. పవన్ కళ్యాణ్ మైనింగ్ మాఫియాను అంతు చూసేందుకు రత్నాపూర్ వెళ్తాడు. మైనింగ్ మాఫియా ఎలా ఉంటుంది.. ఎంత తీవ్రంగా ఉంటుంది.. వాటికి పరిష్కారం ఏమిటి అనే అంశాలను పవన్ ఈ సినిమా ద్వారా విశ్లేషించుకుంటున్నాడని.. ఇది రాజకీయాలకు కూడా ఉపయోగపడుతుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. పవన్ పొలిటికల్ ఎంట్రీకి సర్దార్ సినిమా ఉపయోగపడుతుందని కూడా కొందరి అభిప్రాయం.