రజినీకాంత్ కొత్తపార్టి పెడతారా..?

Tuesday, April 5th, 2016, 10:49:06 AM IST


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన నటనే కాదు.. డైలాగులు కూడా విలక్షణంగా ఉంటాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ దేవుడి శాసనం ప్రకారం ఒదిగే ఉంటాడు. దేవుడు శాసిస్తే.. రజినీకాంత్ పాటిస్తాడు.. సినిమాలోనే కాదు.. రజినీకాంత్ నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడు. రజినీకాంత్ తమిళనాడు ప్రజలకు ఆరాధ్యదైవం. రజినీకాంత్ ఎలా చెప్తే.. ఆయన అభిమానులు అలా నడుచుకుంటారు. ఇక, ఇప్పుడు తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 6 వ తేదీన తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక, తమిళనాడు పార్టీలన్నీ కూడా రజినీకాంత్ సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపి రజినీకాంత్ ను రాజకీయాలోకి ఆహ్వానించాలని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నది. పలుమార్లు ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. ఇక మోడీ కూడా రజినికాంత్ ను కలిసి మాట్లాడారు. కాని, రజినీకాంత్ మాత్రం రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్దంగా లేరు.

ఆ దేవుడు శాసిస్తే.. రజినీకాంత్ పాటిస్తాడు అని చెప్పే రజినీకాంత్ ను దేవుడు రాజకీయాలలోకి వెళ్ళమని చెప్తే.. ఏపార్టీలోకి వెళ్తారు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయి. ప్రజలను ఏదో రూపేణా మోసం చేస్తున్నాయి. అధికారంలోకి రాకముందు చెప్పేవి ఒకటైతే.. అధికారంలోకి వచ్చాక చెప్పేది మరొకటిగా ఉంటున్నాయి. ఇటువంటి సమయంలో ఆ దేవుడు కనుక రజినీకాంత్ ను రాజకీయాలలోకి వెళ్ళమని శాసిస్తే.. ఏ పార్టీలోను చేరకుండా ఆయనే సొంతంగా పార్టీని స్థాపించవచ్చు. రజినీకాంత్ కొత్తపార్టీని స్థాపిస్తే.. ఆయనకు ఉండే ఫాలోయింగ్ తో ఖచ్చితంగా రజినీకాంత్ గెలుస్తారని చెప్పొచ్చు. మరి ఆ దేవుడు రజినీకాంత్ ను ఎప్పుడు శాసిస్తాడో.. రజినీకాంత్ రాజకీయాలలోకి ఎప్పుడు వస్తారో చూద్దాం.