పవన్ రాజకీయాల కోసం ఆ ఇద్దరు కృషి చేస్తున్నారా..?

Tuesday, June 7th, 2016, 08:20:03 AM IST


పవన్ కళ్యాణ్.. ఈపేరు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతున్నది. ఆంధ్రపదేశ్ లో మార్పు కావలసి వస్తే అది పవన్ తో సాధ్యం అవుతుందని యువత నమ్ముతున్నది. అయితే, రాజకీయాలు వేరు .. సినిమా వేరన్న సంగతి ఇప్పటికే పవన్ తెలుసుకున్నారు. అందుకే పవన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. 2018 వరకు పూర్తిస్తాయి రాజకీయాలలోకి రావాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

2014 ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే, పవన్ సొంతంగా పార్టీని ఇప్పటివరకు ప్రజలలోకి తీసుకెళ్లలేదు. ఇప్పటి నుంచే పవన్ ప్రజలలోకి వెళ్తే కాని వచ్చే ఎన్నికల వరకు అది సాధ్యంకాదు. కాని, ఇప్పుడు పవన్ సినిమాలలో బిజీగా ఉన్నారు. సినిమా ద్వారానే ప్రజలలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఎలాగో దాసరితోనూ, అటు త్రివిక్రమ్ తోనూ సినిమా చేస్తానని చెప్పాడు కాబట్టి.. అది రాజకీయంగా తనకు బూస్ట్ ను ఇచ్చే సినిమా కావాలని పవన్ కోరతాడ.

దీంతో దాసరి, త్రివిక్రమ్ లు కలిసి పవన్ రాజకీయంగా ఉపయోగపడే స్టొరీని తయారు చేస్తున్నారని ఒక సమాచారం. 1983 లో రామారావు పార్టీ పెట్టిన కొత్తల్లో కృష్ణ ఈనాడు సినిమా ఎలాగైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పాటును అందించిందో.. ఇప్పుడు ఇది కూడా అలాగే జనసేనకు బలం చేకూర్చాలనే తలంపుతో ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది. మొత్తానికి పవన్ రాజకీయాల కోసం ఆ ఇద్దరు ఈ విధంగా కష్టపడుతున్నారన్నమాట.