బాబు దెబ్బకు..పవన్ తో పాటు జగన్ కూడా రేసులోకొచ్చాడు..!

Sunday, May 15th, 2016, 10:10:19 PM IST


ఏపికి ప్రత్యేక హోదా ఇష్యూపై పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవ రోజురోజుకు పెరిగిపోతున్నది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. నెరవేరడంలేదు. కేంద్రంపై భారం వేసి ఒత్తిడితీసుకురాకుండా ఉండటంతో.. ప్రజలలో అయోమయం నెలకొన్నది. ఎలాగైనా హామీలు నెరవేర్చాలని.. హామీలు నెరవేరితేనే వచ్చే ఎన్నికలలో గెలవవచ్చని నాయకు భావిస్తున్నారో లేక, ఎన్నికలకు ముందు హామీలు కొన్ని నెరవేరిస్తే సరిపోతుందిలే అనుకున్నారో తెలియదు కాని, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మాత్రం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ దూసుకుపోతున్నది.

ఇక మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ తప్పితే మరో ఆప్షన్ లేదని అనుకుంటున్న సమయంలో స్వయంకృత అపరాధంతో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడిపోయింది. దీంతో మరో ఆప్షన్ గా జనసేన లేదంటే వైకాపానా అని ప్రజలు చూస్తున్నారు. అయితే, జనసేన కంటే కూడా వైఎస్ జగన్ కు కాస్త ఎక్కువగానే ప్రజలు మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తున్నది. జగన్ చంద్రబాబు ను మించిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలుస్తున్నది.