యువతిపై గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ….మహిళకు షాకిచ్చిన యువతి!

Thursday, August 9th, 2018, 12:10:50 PM IST

హైదరాబాద్ వంటి మహానగరిలో ఎందరో యువత, పలు రాష్ట్రాలనుండి ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం వస్తుంటారు. అటువంటి వారు ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కువమందే వుంటారు. అయితే తెలియని ప్రాంతం కావడం వలన ఏమాత్రం ఏమరుపాటు వహించామో, ఇంక అంతేసంగతులు అనే విషయాన్నీ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇటువంటి మహానగరాల్లో కొత్తగా ఎక్కడినుండో వచ్చి నివసించేటపుడు, లేదా ఏదైనా ఉద్యోగ వేట సాగించినపుడు జాగ్రత్త వహించకపోతే నష్టం తప్పదు అనేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన ఒకరకముగా ఉదాహరణగా చెప్పవచ్చు. విషయంలోకి వెళితే, గత నెలలో కృష్ణజిల్లా కు చెందిన 27ఏళ్ళ యువతీ, బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లోని అమీర్ పేట వద్దగల ఎల్లారెడ్డిగూడా ప్రాంతంలోగల ఒక హాస్టల్ లో ఉంటోంది. అయితే అక్కడి వాతావరణం మరియు భోజనం సరిపడక హాస్టల్ లోని కొందరి ద్వారా ఒకరి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా దిగింది.

తన ఉద్యోగం మరియు తమ కుటుంబ పరిస్థితిని ఆ ఇంటి యజమానురాలుకు మాములుగా తన పరిస్థితి వివరించింది ఆ యువతీ. తనకు తెలిసిన శిరీష అనే సంఘసేవకురాలు వుంది, ఆమె చాలా మంచిది నీ వంటివారికి ఎందరికో మంచి ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాలు బాగుచేసింది. నేను ఒకరోజు ఆమె దగ్గరకు తీసుకువెళతాను అంటూ నమ్మబలికింది యజమానురాలు. ఒకరోజు శిరీష దగ్గరకి తీసుకెళ్లగా, శిరీష తమకు తెలిసిన వారు ఒకరు రేపు సికింద్రాబాద్ స్టేషన్ కి వస్తున్నారు, మనం వెళ్లి కలుసుకుంటే ఉద్యోగం వస్తుంది, అని నమ్మబలికి మరుసటిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు స్టేషన్ లోనే గడిపేలా చేసింది శిరీష. ఇక వారు రాకపోవచ్చు మనమే వాళ్ళ ఊరైన గుంటూరు, కారులో వెళదామని నమ్మించి కొంత దూరం వెళ్ళాక యువతీ దాహం కోసం నీరు అడగ్గా నీళ్లు ఇచ్చింది. ఆ నీళ్లు తాగిన యువతీ స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే కొందరు మృగాళ్లు తన కారులో ఎక్కి తనపై ఒకరి తరువాత మరొకరు క్రూరంగా తనపై అత్యాచారం చేయడంతో, ఆ సమయంలో ప్రతిఘటించగా యువతికి చిన్నపాటి దెబ్బలు తగిలాయి.

అయితే చివరకు వారి బారినుండి తప్పించుకుకున్న యువతీ ఎలాగోలా ఇంటికి చేరుకొని జరిగిన ఘటనను మనసులోనే దాచుకుంది. కాగా కొద్దిరోజులనుండి తీవ్ర మానసిక ఆవేదనతో తిండి కూడా సరిగా తినకపోవడంతో ఆరాతీసిన ఆమె తల్లితండ్రులకు జరిగిన అసలువిషయం చెప్పగా, వారు ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో శిరీష పై ఫిర్యాదు చేయించారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అతి త్వరలోనే శిరీషను, మరియు పేయింగ్ గెస్ట్ గా వున్న ఇంటి యజమానురాలిని పట్టుకుంటామని పోలీసులు చెపుతున్నారు. అందువల్ల ఎవరైనా ఈ మహానగరానికి వచ్చే ముందు అన్నివిషయాలు జాగ్రత్తగా అలోచించి రావాలని, వచ్చాక ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా ప్రతిక్షణం మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు…..