13 ఏళ్ల బాలికపై విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ కూడా..

Saturday, July 7th, 2018, 05:21:24 PM IST

బీహార్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. టీనేజ్ బాలికపై దాదాపు ఏడూ నెలల వరకు అత్యచారం జరపటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఘటన గురించి మరవకముందే మహిళలపై మరొక దాడి జరగటం ఇటీవల కాలంలో అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇక 13 ఏళ్ల బాలికపై కనికరం లేకుండా ఉపాధ్యాయులు కూడా అత్యచారం జరపడం మరి దారుణం. మొత్తంగా పద్దెనిమిది మంది తన అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక రీసెంట్ గా పోలీసులకు పిర్యాదు చేసింది.

గత ఏడాది డిసెంబర్ నెలలో తన తండ్రి జైలుకి వెళ్ళగానే తనకు వేధింపులు మొదలయ్యాయి ఆ బాలిక తెలిపింది. బిహార్‌లోని సరన్ జిల్లాలో తండ్రి లేని బాలికను మొదటగా క్లాస్ మెట్ అత్యచారం జరిపినట్లు తెలిసింది. ఇక ఆ తరువాత ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు పలువురు విద్యార్థులు కూడా తనపై ఏడూ నెలల నుంచి అత్యాచారానికి ప్లాపడ్డారని బాలిక ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక చెప్పిన వివరాల ప్రకారం అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వెంటనే ప్రిన్సిపాల్ ని అలాగే ఇద్దరు విద్యార్థులతో పాటు టీచర్లను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మరికొంత మంది పరారీ లో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు.