పిల్లలతో పాటు భర్తను కూడా చంపాలనుకుందట!

Monday, September 3rd, 2018, 02:26:45 PM IST

ప్రియుడి కోసం కని పెంచిన బిడ్డలని కడతేర్చింది ఓ మహిళ. మొదట భర్తను కూడా చంపేయాలని ప్లాన్ చేసింది. కానీ అతను ఆఫీస్ లో పని ఉండడంతో ఇంటికి రాలేకపోయాడు. అందువల్ల అతను భార్య నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. మూండ్రాంకట్టలైకు చెందిన విజయ్‌ భార్య అభిరామి ప్రియుడిపై మోజుతో ఇటీవల పిల్లలకు పాలల్లో విషం కలిపి తాగించింది. అయితే భర్తకు కూడా ముందే కలిపి రెడీగా ఉంచింది. కానీ అతను రాకపోవడంతో అభిరామి అప్పుడే పారిపోయింది.

ఇంటికి వచ్చిన విజయ్ పిల్లలను తట్టి లేపాడానికి ప్రయత్నం చేశాడు. వారు మరణించారని తెలుసుకొని ఇద్దరిని హద్దుకొని బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలి కోసం వేట మొదలు పెట్టగా మొదటి ఆమె ప్రియడు సుందరం ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అప్పుడు సుందరం ఆమెను కన్యాకుమారి పంపించి అక్కడ కలుసుకొని వివాహం చేసుకుందామని చెప్పాడు. అయితే ఇంతలో పోలీసులు సుందరం ను అదుపులోకి తీసుకొని విచారించగా అభిరామి కన్యాకుమారి వెళ్లినట్లు తెలుసుకొని ఆమెను అక్కడ అరెస్టు చేశారు.

విచారణలో అభిరామి కొన్ని విషయాలు తెలిపింది. భర్త సరిగా ఇంటికి రాడని పైగా అనుమానించే వాడని చెప్పింది. అప్పుడే తనకు బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారినట్లు తెలిపింది. అలాగే రోజు భర్త లేని సమయంలో బిర్యానీ ఆర్డర్ చేయించుకొని సుందరాన్ని ఇంట్లోకి పిలిపించుకునేదాన్ని. దీంతో నా భర్త అనుమానించడంతో చంపేయాలని అనుకున్నట్లు తెలిపింది. అందులోభాగాంగానే పిల్లలను కూడా హతమార్చాలని ఆ రోజు పిల్లలకు కూడా విషం కలిపిన పాలను ఇచ్చాను అని అభిరామి వివరణ ఇచ్చింది.