సీఎం నాపై అత్యచారం చేశాడు

Monday, February 19th, 2018, 05:25:58 PM IST

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూకి ఓ యువతి షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఓ యువతీ చేసిన ఆరోపణలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. తనపై అత్యాచారం చేశారంటూ సీఎంపై ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ యువతి ఒక మహిళా లాయర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి తెలిపిన కథనాల ప్రకారం.. 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా తనపై అత్యాచారానికి ఒడిగట్టారని చెప్పింది.

నేను అప్పుడు స్పృహ లో లేను. అయితే ఆ సమయంలో పేమా ఖండూ మరో ముగ్గురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యచారం చేసినట్లు ఆమె తెలిపింది. నాకు ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి సహాయం అందలేదు. పైగా నాపై చాలా నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాని అంటున్నారు. నేను మరి అంత నీచానికి దిగజారలేదు. ఓ న్యాయవాది సహాయం వల్ల మహిళాసంఘాన్ని కలిశాను కేసు కూడా నమోదు చేశాను అని ఇప్పుడు న్యాయం జారకపోతే నా లాంటి బాధితులు ఎవరిని నమ్మలేరు అని బాధిత తెలిపింది.