చంద్రబాబు పై యుద్దానికి బయలుదేరిన జగన్

Friday, May 6th, 2016, 02:00:41 AM IST


ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు అసమర్థతని ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నారు. త్వరలో రాష్ట్రం అంతటా పర్యటనలు చేస్తూ కేంద్రం, చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదాను ఎలా నీరు గార్చారు అనేదాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో ఆయన ముందుకెళుతున్నట్లు పార్టీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. ఈ 10 నెల నుండి అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని అన్నారు.

కేంద్రం రాష్ట్రానికి విభజన చట్టం, పునర్నిర్మాణ చట్టం ప్రకారం ఇవ్వవలసిన నిధులన్నీ ఇచ్చేసినట్టు, మొదటి ఏడాది రెవెన్యూ లోటును భర్తీ చెయ్యాలన్న ఖచ్చితమైన నిబంధన ఇక్కడ చట్టాల్లో లేదని అంటున్నారు. దీన్ని బాబు ఎందుకు ఖండించడం లేదు. కేవలం ఆయన వ్యక్తి ప్రయోజనాల కోసమే మౌనం వహిస్తున్నారు, అది న్యాయం కాదు. దీనిపై మా నేత జగన్ అలుపెరగని పోరాటం చేస్తారు అన్నారు.