ఆయన.. ఆ ఎమ్మెల్యే లాంటి వ్యక్తి కాదట..!

Friday, April 15th, 2016, 10:33:18 AM IST


2014 ఎన్నికలలో విజయవాడ వెస్ట్ నుంచి వైకాపా పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన జలీల్ ఖాన్.. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా వైకాపా కు గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో చేరడం వెనుక జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణం అని తెలుస్తున్నది. వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని, అంతేకాకుండా… జగన్ విధానాలతో పార్టీకి చేటు జరిగే అవకాశం ఉండటమే కాకుండా. నియోజక వర్గం అభివృద్ధి కూడా కుంటుపడుతుందని.. అందుకే జగన్ పార్టీని వదిలి తాను తెలుగుదేశం పార్టీలో చేరానని జలీల్ ఖాన్ ప్రకటించారు.

అంతేకాదు, వైకాపాలోని సీనియర్ నేతలకు కూడా జగన్ కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, వచ్చే ఎన్నికలలో ఇప్పుడు గెలిచిన వ్యక్తులకు జగన్ టిక్కెట్ ఇచ్చేది అనుమానమే అని పేర్కొన్నారు. అయితే, జలీల్ ఖాన్ వ్యాఖ్యలను శ్రీకాళహస్తి నేత మధుసూదన్ రెడ్డి తిప్పికొట్టారు. పెద్ది రెడ్డి చాలా సీనియర్ నేత అని, పెద్దిరెడ్డికి చంద్రబాబుతో కింద పనిచేయవలసిన అవసరం లేదని అన్నారు. జలీల్ ఖాన్ వంటి వ్యక్తులు వైకాపాపై ఎన్ని అసత్యపు ఆరోపణలు చేసినా.. ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని అన్నారు. రాష్ట్రం సమస్యలపై దృష్టి సారించకుండా.. అవతలి పార్టీలోని నేతలకు తమ పార్టీలోకి లాగేసుకునే పనిలో ఉండటం విచిత్రంగా ఉందని వైకాపా నేత పేర్కొన్నారు.