జగన్ ఇంగ్లాండ్‌ పర్యటనతో బ్యాగులు సర్దుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Tuesday, June 28th, 2016, 08:44:14 AM IST


మొన్నీ మధ్య వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ కుటుంబంతో సహా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లి ఆటలతో ఉల్లాసంగా గడిపారు. ఆయన పర్యటనలో ఉండగా విడుదలైన ఆయన ఫోటోలు వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా కదలిక తెచ్చాయి. ఎన్నాళ్ల నుండో విదేశీ టూర్ వెళ్లాలని అనుకుంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆహా.. పార్టీ అధినేతే టూర్ కు వెళ్లారు ఇక మనం కూడా విమానం ఎక్కొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట.

గత నెలలోనే టూర్లకు వెళ్లాలని అనుకుని కరువు కారణంగా జగన్ నిరాకరణతో ఆగిపోయిన 21 మంది ఎమ్మెల్యేలు ఈసారి ఎలాగైనా టూర్ వెళ్లాల్సిందేనని బ్యాగులు సర్దుతున్నారు. మరోవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం జూలై 10 నుండి ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఎమ్మెల్యేలంతా ఆయన వెళ్ళారుగా మేమూ వెళ్లాల్సిందేననే పంతంలో ఉన్నారట. ఇప్పటికే పలు కారణాలతో అధినేతపై అలకతో ఉన్న నేతలు ఈ టూర్ గనక క్యాన్సిల్ అయితే పక్క పార్టీలకు లగేజీ షిఫ్ట్ చేస్తారేమో మరి.!