33కు చేరిన పాట్నా మృతులు

Saturday, October 4th, 2014, 03:40:02 PM IST

బీహర్ రాజధాని పాట్నా గాంధీ మైదానంలో శుక్రవారం రాత్రి రావణ సంహారం కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఇక ఈ దుర్ఘటనలో గాయపడినవారు 29మంది కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుండి 2లక్షలు, బీహార్ ప్రభుత్వం 3లక్షలు నష్టపరిహారం ప్రకటించారు.