పెను తుఫానుగా ‘హుదూద్’

Friday, October 10th, 2014, 08:43:35 AM IST

తూర్పు మధ్య బంగాళాఖాతంలో హుదూద్ మరో 12గంటలలో పెను తుఫానుగా మారుతోంది. అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం విశాఖ-గోరక్ పూర్ ల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఇక భారీ గాలుల నడుమ 11వ తేదీ నుండి ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపధ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక జారీ చేసారు. అలాగే సముద్రంలో చేపల వేటను కూడా అధికారులు నిషేధించారు.