గూగుల్ ఇండియాతో ఏపీ ఒప్పందం

Monday, September 29th, 2014, 03:11:37 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ నగరం చేరుకొని రుషికొండ ఐటి పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇక విశాఖ నోవాటల్ లో పలు ఐటి కంపెనీల సీఈఓ లతో ఏర్పాటుచేసిన సదస్సులో చంద్రబాబు మరియు ఇతర మంత్రులు పాల్గొని చర్చలు నిర్వహించారు.