బిలావల్ వ్యాఖ్యలపై బీజేపి గరం గరం

Sunday, September 21st, 2014, 01:36:21 PM IST

భారత్ నుంచి కాశ్మీర్ ను లాక్కుంటామని అన్న బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామీ తిప్పికొట్టారు. బిలావల్ మాటల్ని చిన్న పిల్లవాని మాటలుగా అభివర్ణించారు. పాక్ ను అంతం చేసే శక్తి భారత్ కు ఉందని, కాని తాము యుద్ధం కోరుకోవడంలేదని ఆయన అన్నారు.