ఓరి దేవుడా.. మాంసం కూడా ల్యాబ్ లోనే తయారవుతుందట..!

Tuesday, March 15th, 2016, 10:09:43 AM IST


ఇప్పటి వరకు మనకు మాంసం తినాలి అంటే జంతువులను హింసించి చంపాల్సి వచ్చేసి. ఇలా జంతువులను చంపడం వలన వాటి సంఖ్య క్రమేపి తగ్గిపోతున్నది. అంతేకాకుండా, మాంసం ఎక్కువ రోజులు నిల్వకుడా ఉండదు. ఇకపోతే, జంతువుల నుంచి తయారయ్యే మాంసం తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయని మనకు తెలిసిందే. శాఖాహరులకు.. మాంసాహారులకు మధ్య పోరు జరుగుతున్న ఈ సమయంలో.. మాంసాహారులకు ఒక శుభవార్త.. మాంసం తినాలి అనుకునే వారు హ్యాపీగా లాంగించేయవచ్చు.. అది ఎలాగో తెలిసా.. మరో రెండు లేక మూడు సంవత్సరాలలో ల్యాబ్ లో తయారైన మాంసం బయటకు వస్తున్నదట. అవును. ల్యాబ్ లో తయారైందే. జంతువుల కణాలకు ఆక్సీజన్, పోషక పదార్ధాలను ఇచ్చి.. ల్యాబ్ లో డెవలప్ చేస్తారు. 21 రోజులలో మాసం తయారవుతుంది. ల్యాబ్ లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. పూర్తిస్తాయిలో మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్దమవుతున్నది. రెండు మూడు సంవత్సరాలలో అన్ని రిటైల్, రెస్టారెంట్స్ కు ఇలా తయారైన మాంసం అందుబాటులోకి వస్తుందట. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.