పగటి కలలతో బరువు పెరుగుతారట.. !

Thursday, January 28th, 2016, 12:36:17 PM IST


పిల్లలు, యువకులే కాకుండా పెద్ద వాళ్ళు కూడా పగటి పూట ఎక్కువగా కలలు కంటుంటారు. ఇలా చేయడం వలన మనిషి తనకు తెలియకుండానే బరువు పెరుగుతారని ఇటీవలే అమెరికాకు చెందిన పరిశోదకుల పరిశోధనలో తేలింది. అయితే, ఎక్కువగా మనిషి తినే సమయంలో ఎక్కువగా తన జీవితం గురించి కలలు కంటూ ఉంటారు. అలా పగటి కలలు కంటూ ఆహరం తినడం వలన ఏం తింటున్నారో.. ఎంత తింటున్నారో వారికే తెలియకుండా తినేస్తుంటారు. అలా తనకు తెలియకుండా ఎక్కువగా తినడం వలన శరీరం బరువు పెరిగి ఉబకాయులుగా తయారువుతున్నారట.

ఇకపోతే, మెడకు కూడా దానికి అలవాటు పడిపోవడం వలన తినే విషయాన్ని పెద్దగా పట్టించుకోదని, అందుకే తినే తిండి విషయంలో కంట్రోల్ తప్పిపోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. తిండిపై నియంత్రణ లేకపోవడంతో ఉబకాయులుగా మారిపోతున్నారని అంటున్నారు శాస్త్రవేత్తలు.