సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో చాలెంజ్ ఇదే..!

Thursday, February 4th, 2016, 01:13:39 PM IST


సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో చాలెంజెస్ హిట్ అయ్యాయి. అందులో ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, కండోమ్ ఛాలెంజ్ ఇలా ఎన్నో పాపులర్ అయ్యాయి. వీటిల్లో కొన్ని చారిటి కోసం ప్రారంభిస్తే.. మరికొన్ని సరదా కోసం ప్రారంభించారు. ఇక ఇటీవలే పేస్ బుక్ లో మరో కొత్త ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్నది. అదే నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్.

టీవీ షోలలో ఎక్కువగా కనిపించే మిసెస్ టేలర్ తాను ప్రేమగా పెంచుకునే పిల్లిని, వైన్ బాటిల్ ను అలాగే నిద్రపోతున్న ఫోటోలను పేస్ బుక్ లో పోస్ట్ చేసి దానికి నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్ అనే పేరు పెట్టింది. అంతే ఆ ఐదు ఫోటోలకు 24 గంటలలోనే లక్షా పదిహేను వేల లైక్ లు వచ్చాయట. ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతున్నది. అయితే, పిల్లలు లేరని బాధపడేవారు ఈ నాన్ మదర్ హుడ్ తో ఇబ్బందులు పడతారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.