40 మిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప టీజర్

Monday, April 12th, 2021, 12:18:59 PM IST


స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నాలుగు రోజుల క్రితం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయింది. ఈ టీజర్ విడుదల చేసేందుకు ఒక ఈవెంట్ ను సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటి వరకూ 40 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 1.1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

ఈ చిత్రం కథ మొత్తం కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా రశ్మిక మందన్నా నటిస్తుండగా, ప్రతినాయక పాత్రలో ఫాహద్ ఫజిల్ నటిస్తున్నారు. ఆగస్ట్ 13 వ తేదీన ఈ చిత్రం ఏక కాలంలో తెలుగు, హిందీ భాషలతో పాటుగా, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కూడా పాన్ ఇండియా తరహాలో విడుదల కానుంది. ఈ సినిమా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలపడానికి టీజర్ వ్యూస్ ఒక ఉదాహరణ గా భావించవచ్చు.