పవన్ రేంజ్ అలాంటిది – ప్రకాష్ రాజ్!

Thursday, July 30th, 2020, 01:14:11 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా గా తెరకెక్కించిన పవర్ స్టార్ చిత్రం పలు వివాదాలకు దారి తీసింది. వర్మ వైఖరి కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ కార్యాలయం పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అయితే ఇది ఇలా ఉంటే, తాజాగా రామ్ గోపాల్ వర్మ మరియు పవన్ కళ్యాణ్ ల గురించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ, వర్మ తో నేను ఎక్కువగా పని చేయలేదు, కానీ, అతడిని చాలా సార్లు కలిశాను, అతనికి ఉన్న జ్ఞానం గొప్పది అని కితాబిచ్చారు.

అయితే అందరు అనుకున్నట్లు గా వర్మ చెడ్డవాడు కాదు అని అన్నారు. అలాగని అందరి లాంటి మనిషి కూడా కాదు అని అన్నారు. అయితే పవర్ స్టార్ చిత్రం ద్వారా తాను ఏదో చెప్పాలని అనుకున్నాడు అని తన అభిప్రాయం ను చెప్పారు. అయితే నచ్చితే చూ డొచ్చు, లేకపోతే వదిలి వేయొచ్చు. అతను బలవంతం చేయడం లేదు, తన లిమిట్స్ లో ఉంటాడు అని ఆశిస్తున్నా అని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు అని, తప్పుగా చూపించినంత మాత్రాన పవన్ కి పోయేదేమీ ఉండదు అని, పవన్ కళ్యాణ్ రేంజ్ అలాంటిది అని అన్నారు. అయితే వర్మ ను అలా వదిలెయ్యడం మంచిది అని కూడా సలహా ఇచ్చారు.