ఐసియూ లో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్

Friday, October 23rd, 2020, 08:35:18 AM IST

ఇటీవల అనారోగ్యం తో బాధపడుతున్న హీరో, నటుడు రాజశేఖర్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి లో చేరారు. అయితే ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు గురువారం నాడు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే నటుడు రాజశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని,వైద్య చికిత్స కి ఆయన శరీరం సహకరిస్తుంది అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇటీవల నటుడు రాజశేఖర్ కుటుంబానికి కరోనా వైరస్ సోకిన విషయాన్ని తానే వెల్లడించారు. తన ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారు అని, తాను జీవిత చికిత్స పొందుతున్నాము అని తెలిపారు. శివాత్మిక సైతం తన తండ్రి కరోనా వైరస్ తో పోరాడుతున్నారు అని, ఆరోగ్యం నిలకడగానే ఉంది అని, మీ ప్రార్థనలు, శుభాకాంక్షలు కావాలని తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్యం పై పలువురు ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.