ఆ దర్శకుడిని దేశద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్ కౌర్!

Sunday, June 28th, 2020, 02:30:05 PM IST

తెలుగు సినీ పరిశ్రమ లో ఉన్న నటి పూనమ్ కౌర్ విషయం లో చాలా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక స్టార్ హీరో విషయం లో పూనం చాలావరకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఒక గంటకు పైగా నా బ్రెయిన్ ను వాష్ చేసి మాట్లాడిన ఒక దేశ ద్రోహి దర్శకుడి కాల్ ను రికార్డ్ చేసి ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి గురించి వ్యతిరేకంగా చాలా చెప్పినట్లు వివరించారు. అయితే ఆ దర్శకుడు పంపిన కొన్ని ట్వీట్స్ ను ఆ వ్యక్తి సంబంధించి పార్టీ కి పంపా అని వ్యాఖ్యానించారు.

అయితే పూనం కౌర్ కు మీడియా లో కొందరు నమ్మదగ్గ వ్యక్తులు ఉండటం వలన అతని ఉద్దేశ్యం ఏంటో తెలిసింది అని వ్యాఖ్యానించారు. అయితే పూనం కౌర్ చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే ఇదివరకు మరో ట్వీట్ లో పూనం కౌర్ రామ్ గోపాల్ వర్మ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ తాజాగా పవర్ స్టార్ అంటూ ఒక చిత్రాన్ని అనౌన్స్ చేసీ, అందులో పాత్రల గురించి కొన్ని షాట్ కట్ రూపం లో వివరించారు. దీని పై స్పందిస్తూ, చిన్నపుడు ఆర్జీవీ పై అభిమానం ఉండేది అని, ఇపుడు లేదు అని అంటున్నారు. అయితే పూనం కౌర్ ముందుగా పెట్టిన ట్వీట్ ల పై నెటిజన్లు మాత్రం భిన్నం గా స్పందిస్తున్నారు.