ప్రేమ పాఠాలు చదువుతున్న మరో ‘యువ హీరో’..!

Monday, June 27th, 2016, 04:17:06 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేమ జంటల సందడి ఎక్కువైంది. ఒకవైపు స్టార్ పెయిర్ నాగ చైతన్య, సమంతలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే మరోవైపు యంగ్ హీరో ‘అడవి శేష్’ కూడా ప్రేమ పాఠాలు చదువుతున్నాడు. ఈ మధ్యనే ‘క్షణం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ యువ హీరోకు మంచి మంచి ఆఫర్లు చేతిలో ఉన్నాయి.

పర్ఫెక్ట్ ఫిజిక్, మంచి అందం, ఉన్నత చదువు, నటనలో అనుభవం ఉన్న అడవి శేష్ ఇండస్ట్రీకి చెందిన ఓప్రముఖ నటుడి మేనకోడలితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరనే వివరాలు బయటకు రాలేదుకాని అడవి శేష్ ఆమెతో మంచి హెల్తీ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడని పైగా పెళ్లికి కమిట్మెంట్ కూడా ఇచ్చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.