పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో!

Monday, March 2nd, 2015, 01:27:36 PM IST


తమిళనాట ప్రముఖ నటుడు అజిత్ కు పుత్రోత్సాహం కలిగింది. కాగా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన అజిత్, ప్రముఖ నటి శాలినిని 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఏడేళ్ళ క్రితం వారికి అనౌష్క అనే చిన్నారి జన్మించింది. ఇక ఇప్పుడు తాజాగా శాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఇటీవల అజిత్ నటించిన ‘యెన్నై ఆరిందల్’ అనే చిత్రం ఘన విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న అజిత్ ఇప్పుడు కుమారుడు జన్మించడంతో మరింత హుషారుగా ఉన్నట్లు తమిళ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక 1999లో ‘అమర్ కాలం’ చిత్ర షూటింగ్ సమయంలో అజిత్, శాలినిని ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శాలిని నటనకు దూరమయ్యారు.