అఖిల్ ప్రేయసి వివరాలు తెలిశాయండోయ్..!

Tuesday, June 28th, 2016, 12:22:46 PM IST


అక్కినేని కుటుంబ వారసులైన నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ ప్రేమలో మునిగి తెలుస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం బహిర్గతమై త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుండగా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సైతం ప్రేమ పాఠాలు వల్లిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే అఖిల్ ప్రేమ వ్యవహారం బయటికి రాగా అతను ప్రేమించేది ఎవర్ననేది ఇన్నిరోజులూ సస్పెన్స్ లో ఉంది.

కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. ఆ అమ్మాయి నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త షాలిని భూపాల్ కుమార్తె ‘శ్రేయా భూపాల్’ అట. న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఈమె ప్రస్తుతం డిజైనింగ్ రంగంలోనే కొనసాగుతోంది. అంతేగాక ఈమె ఇటీవల జరిగిన సౌత్ ఫిల్మ్ ఫేర్ కు అఫీషియల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసిందట. ఇకపోతే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయట. ఇదిలా ఉండగా అఖిల్ త్వరలో ‘హను రాఘవపూడి’ దర్శకత్వంలో తన రెండవ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు.