అలవైకుంఠపురంలో సినిమా ఖాతాలో మరో రికార్డ్..!

Thursday, February 11th, 2021, 01:16:58 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు మాత్రం సెన్సేషన్ రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఇటీవలే బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 500+ మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని రాములో రాములా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 300+ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. సింగర్స్ మంగ్లీ, అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.