రాజమౌళికి ఫోన్ చేసిన అలియా భట్.. ఏం మాట్లాడిందంటే..!

Tuesday, June 23rd, 2020, 01:00:54 AM IST


దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తుంది.

అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా కూడా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. అయితే ప్రస్తుతం ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆలియా భట్ హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. ఈ నెపధ్యంలో రాజమౌళికి ఫోన్ చేసి ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల గురుంచి వివరించిందని, షూటింగ్ వంటి విషయాలపై కూడా వీరిద్దరు మాట్లాడినట్టు సమాచారం.