పుష్ప కోసం నల్లబడుతున్న బన్నీ… కానీ

Tuesday, February 23rd, 2021, 11:21:22 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే ఒక లెవల్ లో ఉంటుంది అనడానికి అలా వైకుంఠ పురం లో చూస్తే తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ డెడికేషన్, వర్కింగ్ అనేది ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. అందుకే స్టైలిష్ స్టార్ కి టాలీవుడ్ లో మాత్రమే కాక, ఇతర ప్రాంతాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రానికి బన్నీ విపరీతంగా కష్టపడుతున్నారు. ఈ చిత్రం లో క్లీనర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ పాత్ర కోసం నల్లగా మారటానికి ప్రత్యేక మేకప్ వేయించుకుంటున్నారు. ఆ మేకప్ వేసేందుకు రెండు గంటల సమయం పడుతుంది. అదే విధంగా మేకప్ తీసేందుకు కూడా గంటన్నర కి పైగా సమయం పడుతుంది.

అయితే అల్లు అర్జున్ ఈ సినిమా లో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. సినిమా అంతా కూడా లుంగీ మరియు షార్ట్స్ లోనే కనిపిస్తారు అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి పోస్టర్ల వరకూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ సైతం రంగస్థలం చిత్రం తర్వాత ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీ గా ఈ చిత్రం ఆగస్ట్ 13 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం లో కథానాయిక గా రష్మిక మండన్న నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.