ప్రముఖ టాలీవుడ్ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు ట్విట్టర్ ఖాతా తెరిచేందుకు సిద్ధమయ్యారు. కాగా తన పుట్టిన రోజు ఏప్రిల్ 8వ తేదీన సరిగ్గా ఉదయం 8గంటలకు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాను యాక్టివేట్ చెయ్యనున్నారు. ఇక ఈ మేరకు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ఈ విషయాన్ని ఖరారు చేశారు. అయితే ఇంతకు ముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ట్విట్టర్ ఖాతా ఉన్నా అది అతని అసలైన ఖాతా కాదు. కాగా ఇన్నాళ్లుగా అడిగిన సరే ఒప్పుకోని బన్నీ ఇంతకాలానికి కన్విన్స్ అయ్యి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తున్నాడని శిరీష్ తెలిపారు. మరి బన్నీ ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నాడంటే అభిమానులకు శుభవార్తే!
ఇకపై ట్విట్టర్ లో బన్నీ హల్ చల్!
Saturday, April 4th, 2015, 07:14:13 PM IST