అనసూయ అమాంతం పెంచేసింది..!

Monday, May 16th, 2016, 02:12:27 PM IST


బుల్లితెరపై అనేక షోల ద్వారా పాపులర్ అయిన యాంకర్ అనసూయ. టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించేందుకు మొదట కాస్త బెట్టు చేసింది. తరువాత ఏమనుక్కునదో ఏమో తెలియదు కాని, నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనలో చిన్న పాత్రలో నటించింది. ఇది మంచి హిట్ అయింది. తరువాత ఈ అమ్మడు పీవీపీ వారి క్షణం థ్రిల్లింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్లో నటించింది. ఇది కూడా హిట్ అయింది. దీంతో ఈ యాంకర్ తన రేటు (పారితోషికం)ను పెంచేసింది. ఇప్పుడు సినిమా చేయాలి అంటే 40 లకారాలు అడుగుతున్నది.

దీంతో పాపం నిర్మాతలు భేర్ మంటున్నారు. అనసూయ నటించిన రెండు సినిమాలు హిట్ కావడానికి అనసూయ పాత్ర ఏపాటిదో అందరికీ తెలిసిందే కదా. మరలాంటప్పుడు 40 లకారాలు అడిగితే ఎలా. 20కే కొత్త హీరోయిన్లు వస్తున్నారు. మరి 40 డిమాండ్ చేస్తే ఎలా అని నిర్మాతలు వాపోతున్నారు. క్షణం తరువాత ఈ అమ్మడు ఏసినిమాకి సైన్ చేయలేదు. ఇంతపెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తే టీవీ షోలకు సైన్ చేసుకోవడమే కాని.. సినిమాకు సైన్ చేయలేదని అంటున్నారు కొంతమంది నిర్మాతలు.